Telangana State Got 33 Districts : Narayanapet and Mulugu As New Districts | Oneindia Telugu

2019-01-03 4

In Telangana, there are two more districts added for the existing 31 districts. The government has issued orders. Narayanapeta and mulugu districts have been set up for the convenience of the administration. Narayanapeta from Mahabubnagar district, as well as mulugu from Bhupalapalli Jayashankar district are seperated.

తెలంగాణలో ప్రస్తుతమున్న 31 జిల్లాలకు మరో 2 జిల్లాలు తోడయ్యాయి. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నారాయణపేటను.. అదేవిధంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి ములుగును వేరుచేశారు. ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం తరపు నుంచి ప్రాథమిక ప్రక్రియ పూర్తయింది. ఇక మహబూబ్‌నగర్ జిల్లా, భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్లను నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు రెవెన్యూ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి.

Free Traffic Exchange